క్రీస్తుశకం రెండు వేలా పది. భాగ్యనగరం మరో మారు తెలంగాణా ఉధ్యమంతో భగ్గుమంటున్న రోజులు. వేర్పాటు మహాపాపంగా ఒక వైపు, మహాభాగ్యంగా మరో వైపు పరిగణించబడి ఉధ్యమకారులకు ఆందోళన, నాయకులకు అవకాశవాదం మాత్రమే దారిగా ఉధ్యమం జరుగుతున్న రోజులవి. తన సపోర్టు ఏ పక్షం వైపు ఉండాలో అర్థం కాక సతమతమౌతున్నాడు పండితారాధ్యుల వెంకట రాఘవాచారి. క్లుప్తంగా రాఘవాచారి, మరింత క్లుప్తంగా రాఘవ. మొదటి ప్రయత్నంగా తన మూలాల గురించి రీసెర్చు చేయగా గత ఆరు తరాలుగా తన కుటుంబం హైదరాబాదు లోనే నివసిస్తూన్నట్లు తెలుసుకోగలిగాడు. ఆ పై తరాల ఇన్ ఫర్మేషన్ దొరకలేదు. ఇంక ఆ కోణంలో సమయం వ్రుధా చెయ్యడం మాని తను తెలంగాణాకే చెందిన వాడిననని ప్రాధమిక నిర్దారణ కి వచ్చి, తెలంగాణా కే తన సపోర్టు అని నిర్ణయించుకున్నాడు. తన తండ్రి కూడా అదే వాదం వినిపించడంతో ఆ నిర్ణయం మీదే స్ట్రాంగ్ గా ఫిక్స్ ఐపోయాడు. కానీ తన వదిన, అమ్మ, పిన్ని.... ఇలా కొందరు కుటుంబ సభ్యులు కోస్తా, రాయలసీమ ప్రాంతాలకి చెందిన వారై ఉండడం వల్ల తరచూ ఇంట్లో వాతావరణం ఇబ్బందికరంగా తయారవసాగింది. పైగా ఇంట్లో ఈ టాపిక్ వచ్చిన ప్రతి సారీ ఆ ప్రభావం ఎక్కువ కారం రూపంలోనో, తక్కువ ఉప్పు రూపంలోనో ఇంట్లో వంటల మీద పడడం రాఘవకి ఏ మాత్రం రుచించలేదు.
పోనీ జెనరల్ రీజనింగ్ తో వెల్దాం అంటే ఎటు వైపు వాదన వింటే అటు వైపు న్యాయంగా తోచింది. కొందరు ప్రాణాలు కూడా తీసుకుంతున్నారు !! ఇదంతా ఇలా ఉండగా, గత నెల రొజులుగా ఈ అంశం ఆఫీసులో తన పర్ఫార్మెన్స్ మీదకూడా ప్రభావం చూపుతుందని గ్రహించిన రాఘవ పదకొండు మంది సభ్యులున్న కుటుంబాన్ని పోషించే ప్రధాన బాధ్యత తనదే అవటం వల్ల జీవన పోరాటాన్ని మించిన పోరాటం మరేదీ లేదనుకొని, ఈ విషయం పై అప్పడి నుండీ అటు ఆఫీసులో, ఇటు ఇంట్లో మౌనమే తన బెస్టు స్ట్రాటజీ గా ఫాలో అవసాగాడు.
మరుసటి రోజు అర్థరాత్రి కేంధ్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆ రోజు నగరం లో పరిస్థితులను ఉద్రిక్తం చేసింది. మూడింట ఒకటో వంతు ప్రాంతాల్లో కర్ఫ్యూ. ఆఫీసులో కూడా టేబుల్లు ఎడం జరుపుకొవడం తోనే ఆగిన గొడవ ఈ రోజు మాటామాటా అనుకునే స్థాయికి చేరింది. పెద్దగా పని మూడ్ ఉన్నట్టు ఎక్కడా కనిపించలేదు. దుగ్గంటి కీ, ప్రసాద్ కుమార్ కీ మధ్య గొడవ మాటా మాటా దాటి చేయి చేయీ చేసుకునే స్థాయికి చేరుకుంది. కొంత ఆసక్తి నీ కొంత చిరాకు నీ కల్గిస్తిన్న ఆ సన్నివేషం నుండి రాఘవ దౄష్టిని మల్లిస్తూ బయట పెద్దగా ఎవో నినాదాలు వినిపించసాగాయి. వెంటనే 'ఆఫీసు మూసేస్తున్నాం, పెద్ద గొడవ ఏదో జరిగేలా ఉంది, తొందరగా ఇంటికి వెల్లి పోండి ' అని ప్యూన్ చెప్పడం తో అండరితో పాటు తను కూడా ఆదరా బాదరాగా బ్యాగు సర్డుకొని తన రెండవ తరం మోటరు బైక్ వద్దకి ఒకటవ తరం హెల్మెట్ తో సహా బయలు దేరాడు.
రువ్వబడుతున్న రాల్ల చప్పుల్లు, పరుగులెడుతున్న పాదాల చప్పుల్లు, హోరెత్తిన గుండె చప్పుల్లు..... వీటి మధ్య టెన్షను గా బైకుని పార్కింగ్ లాట్ నుండి బయటకి తీస్తుండగా తన ఆఫీసు బిల్డింగ్ లోనే గ్రౌండ్ ఫ్లోరు లో కుడి వైపు గా వున్న నట్వర్ లాల్ జివెల్లరీ షాపు అద్దాలు పగిలిన షబ్ధం విని అటు వైపుగా చూసాడు.
'షాపు పేరు నట్వర్ లాల్ కాబట్టి ఓనరు పేరు కూడ నట్వర్ లాలే ఐ ఉంటుంది.
పాపం నట్వర్ లాల్ !!
ఎలా సంపాదించాడో కానీ ఈ రోజు తన ఆస్తి చిల్లర దొంగల పాలైంది.
వీల్లు ఖచ్చితంగా తెలంగాణా వాదులో సమైఖ్యవాదులో మాత్రం అయి ఉండరు . అదును చూసి దోచుకుంటున్న ఏ చిల్లర దొంగలో ఐఉంటారు....'
అలా సాగుతున్న తన ఆలోచలనలకి బ్రేక్ వేస్తూ తనని తాకిన ఒక చూపు తనని భయానికి గురి చేసింది. తన మాటలు విన్నట్ట్లుగా కోపం తో షాపు నుండి బయటకి తన వైపుగా కోపంతో దూసుకొస్తున్నాడు. దగ్గరిగా వచ్చి, తనను ఢీ కొడుతూ, తనని దాటి దూరంగా పరిగెత్తాక తెల్సింది అతనికుంది తన మీద కోపం కాదని, దూరంగా వస్తూ వున్న పోలీసుల మీద భయం అని. చుట్టూ ఉన్న ఉద్రిక్థత ని గమణించి ఆలొచనలన్నీ కట్టి పెట్టి బైకు స్టార్టు చేసి రయ్య్ మని ఇంటికి బయలు దేరాడు.
శుద్దమైన బ్రాహ్మణ కుటుంబం. మాంసం కాదు కదా, పచ్చి ఉల్లి కూడా ముట్టరు. సూర్య నమస్కారం, ఉపవాసాలు, వ్రతాలు, మడి లాంటి ఆచారాలు ఇంకా తు.చా. తప్పకుండా పాటిస్తారు. తరాలుగా పొడవు తగ్గుతూ వచ్చినా, పిలక మాత్రం పోలేదు. ప్రతి రోజూ గీత చడవడం, ఏ రొజూ నీతి నియమాల గీత దాటక పోవడం అలవాటుగా వస్తున్న కుటుంబం. తాత రిటైర్డు పూజారి. నాన్న రిటైర్డు పూజారి కం లాయరు. అన్న పూజరి, వదిన టీచరు. తను స్టేటు బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ లో అసిస్టెంటు మేనేజరు. తను, అన్నయ్య, నాన్న, తాతయ్య, ఆడ వాల్లు, పిల్లలు అంతా కలిపి పదకొండు మండి సభ్యుల ఉమ్మడి కుటుంబం. తరాలు గా వచ్చిన సొంత ఇల్లు ఉన్నా, నలుగురి ఆదాయం ఉన్నా సంఖ్య ఎక్కువ అవడం వల్ల సాధారణ ఎబో మిడిల్ క్లాసు కష్టాలు ఈ కుటుంబానికీ ఉన్నాయి.
ఇంటికి చేరుకునే సరికి మధ్యాహ్నం ఒకటి అవడం వల్ల ఇంట్లో అందరి తో పాటే తను కూడా భోజనం చేద్దామని రాఘవ ఆఫీసుకి తీసుకెల్లిన టిఫిన్ బాక్సు కోసం బ్యాగులో చెయ్యి పెడితే చేతి వేల్లకి టిఫిన్ బాక్సుకు బదులు మరేదో బాక్సు తగిలింది. బయటికి తీసి చూస్తే' నట్వర్ లాల్ జువెల్లరీస్ ' లేబుల్ తో ఒక అందమైన బాక్సు. బాక్సు ఓపెన్ చేసి చూస్తే నమ్మశక్యం కాని విధంగా జిగేలు మంటూ మెరిసే అందమైన డైమండ్ నెక్లేస్.... !! ఒక సారి రివైండ్ చేసి ఆలోచిస్తే నగల షాపు నుండి బయటకి పారిపోతున్న వ్యక్తి తననని ఢీ కొట్టినప్పుడు ఈ బాక్సు తన బ్యాగులో పడి ఉంటుందని చూ చాయగా అర్థమైంది. చడీ, చప్పుడు చెయ్యకుండా ఆ బాక్సు ని అలాగే తన బ్యాగులో పెట్టి భోజనానికి ఉపక్రమించాడు.
భోజనం అయ్యాక పేపర్ చదవడానికి, టీ.వీ. చూడడానికి ప్రయత్నించాడు గానీ ఎందుకో ఆ నెక్లేసు విషయం తెలిసినప్పడి నుండీ తన మనసు మనసులో లేక పోవడం వల్ల ఏ పనే రెండు నిమిషాలకి పైబడి చేయలేక పోయాడు. ఏదో ఆలొచన. సాయంత్రం ఆరు అవుతుండగా పిల్లలతో సహా అందరినీ హాలు లోకి రమ్మని పిలిచాడు. విషయమేంటా అని ఆలొచిస్తూ ఆత్రుత గా ఎదురు చూస్తున్న వారి ముందు బ్యాగులోంచి బాక్సునీ, బాక్సు నుండి నెక్లేసునీ తీసి టేబుల్ పై ఉంచాడు.
భయం, ఆశ్చర్యం, ఎక్సైట్మెంట్... వీటన్నింటినీ సామంతులుగా నిశబ్ధం కొన్ని క్షణాలు గదిలో రాజ్యమేలింది. తిరుగులేని శత్రుదేశపు రాజులా నిశబ్డాన్ని పటా పంచలు చెస్తూ రాఘువ మాట్లాడ సాగాడు.
"మా ఆఫీసు బిల్డింగ్ లోనే ఉన్న జివెల్లరీ షాపు మీద ఇవ్వాల దోపిడి జరిగింది.
ఒక దొంగ అనుకొకుండా ఈ నెక్లేసు నా బ్యాగులో వేసి వెల్లాడు.
దీని విలువ దాదాపు రెండు లక్షల వరకు ఉండవచ్చు.
పరుల సొమ్ము పాము వంటిది అంటారు,
బాగా అలోచించినతరువాత, నేను ఈ నెక్లేసుని రేపు షాపు ఓనర్ కి ఇద్దాం అని అనుకుంటున్నాను.
మీ అభిప్రాయం తెలుసుకుందామని మిమ్మల్ని ఇక్కడికి పిలిచాను...."
ముగించాడు రాఘవ.
"రెండు కాదు, నాలుగు లక్షల పై మాటే ఉంటుంది దాని ధర...."
అంది రాఘవ భార్య రుక్మిణి, కొన్నా కొనకున్నా మార్కెట్ లో ఉండే ప్రతీ చీర, ప్రతీ నగా రేటు అప్ టూ డేట్ గా తెలిసుకునే టిపికల్ తెలుగు గ్రుహిణిని తలపిస్తూ.
"ఎంతైనా ఉండనీ, ఆ నగ మనకనవసరం,
వేరొకడి సొమ్ము మనకవసరం లేదు"
అన్నాడు రాఘవ నాన్న షేషాచలం, ఒకే మాటని రెండు సార్లు వేరు వేరు వ్యాఖ్యాల్లొ చెబుతూ.
"అవునవును, నాన్న మాటే నా మాట కూడా...."
వంత పలికాదు రఘుపతి, రాఘవ అన్న.
"మీ మాటెవిటి వదినా ?"
"మీ అందరి మాటే నా మాట...."
"ఐతే అండరూ అదే మాటమీదే ఉన్నట్టా ?"
అవుననే చెప్పారు అందరు.
"సరే, రేపు నేను, అన్నయ్యా కలిసి వెల్లి షాపు ఓనరుకి ఇచ్చి వస్తాం...."
చెప్పి నగని మల్లీ బక్సులోకి సర్ది అలమారా రెండవ ఖానాలో పెట్టాడు రాఘవ, పిలిచిన పని అయ్యిందన్నట్లు...
రాత్రి భోజనాలయ్యాయి. ఎవరికీ సరిగ్గా తిండి సహించినట్లనిపించలేదు. వండిన వంట సగానికి పైగా అలానే మిగిలి పోయింది. సమయం పదీ, పదింబావు అవుతుండగా అందరూ నిద్రకి ఉపక్రమించారు తమ తమ గదుల్లో.
పన్నెండు కావస్తుంది. రుఖ్మినికి ఎంతకీ నిద్ర పట్టడం లేదు. రాఘవ, పిల్లలూ ఘాఢ నిద్రలో వున్నారని గమణించిన రుఖ్మిని మెల్లిగా లేచి తన బెడ్ రూం నుండి హాలులోకి వచ్చింది.
మెల్లిగా అలమారా తలుపులు తెరిచి డెస్కు ని బయటకి లాగి నెక్లేసు ని బయటికి తీసి చెతి వెల్లతో ప్రెమగా తడిమింది....
"ఎంతందంగా ఉందో !! ఇదే గనక వేసుకుంటే ఎక్కడికి వెల్లినా అందరి కల్లూ నామీదే ఉంటాయ్....
అమ్మితే వడ్డానం, కమ్మలూ, పట్టీలు.... ఒకటేమిటి, ఎన్నైనా కొనుక్కోవచ్చు !!"
అలా కొంత సేపు సాగిన అలొచనలని నగ తో పాటూ కట్టి పెట్టి, లోన పెట్టి చడీ చప్పుడూ లేకుందా వెనక్కి వెల్లింది.
తను అటు అలా వెల్లగానే ఇటు నుండి రఘుపతి కొడుకు రమేష్ వచ్చి... మల్లీ నెక్లేస్ ని బయతికి తీసి, చెత్తో పట్టుకొని
"దీన్నే గనక అమ్మితే నా ఇంజనీరింగ్ సీట్ కోసం ఎంట్రెన్స్ అని కష్టాలు పడాల్సిన అవసరమే లేదు !!
ది బెస్ట్ కాలేజీ లో సీటు కొనొచ్చు.....'
కానీ ఏం చేస్తాం అన్నట్టుగా నిరాశగా నెక్లేస్ బాక్సుని లోన పెట్టి తన గదిలోకి వెళ్ళాడు.
మరో వైపుగా అప్పుడే అలమారా దగ్గరికి వచ్చిన రఘుపతి మల్లీ నెక్లేస్ ని బయటకి తీసి
"కూతురు పెళ్ళి కట్నం దాదాపు సగం వస్తుంది, దీన్ని వెనక్కి ఇవ్వడం అవసరమా ?
వాడు మాత్రం నిజాయితీగా సంపాదించి ఉంటాడా ??"
అని మరో రెండు ప్రశ్నలు తనకి తానే మనసులో వేసుకొని లాభం లేదన్నట్టుగా వెనక్కి తిరిగి వెల్లాడు.
"ఈ పాత బైక్ తో చస్తున్నా, కొత్త్త బైక్ ఒకటి కొనుక్కోవచు, బైక్ ఏంటి కారే కొనుక్కొవచు !!"
"కాశీ, రామేశ్వరం, ప్రయాగ... అన్ని తీర్థాలు తిరిగి రావొచ్చు"
"కంటి ఆపరేషను, పంటి ఆపరేషను, వాట్ నాట్ ??"
"భూతద్దం, ఎలెక్ట్రిక్ కారు, స్కేటింగ్ బూట్లు, ...."
పండు ముసలి వాల్ల నుండి స్కూలు పిల్లల వరకూ ప్రతి ఒక్కరికీ నగ తమతోనే ఉంచుకోవలని ఉంది. రూపాలు వేరైనా ఉప్పెనలా ఎగసిపడుతున్న తీరని కోరికల్ని ఆదర్షాలు ఎప్పడికప్పుడు తుడిచి వేస్తున్నా అలుపెరుగని కోరికలకీ, అవసరమా అనిపించే ఆదర్షాలకీ మధ్య ఘర్షణ మనసు అంతరంగాల్లో అలా సాగుతోనే వుంది.
ఉదయం నిద్రలేచిన పిదప పిల్లలు స్కూలుకి రెడీ అయ్యేపనిలో, ఆఫీసుకి వెల్లే వారు ఆఫీసుకీ రేడీ అయ్యేపనిలో, ఇంట్లో ఉండే వారు వంట పనిలో బిజీ అయ్యారు. బయట మెల్లిగా జై తెలంగాణా నినాదాలు అప్పుడప్పుడే మొదలవ సాగాయి.
ఏనమిదిన్నర కావొస్తుంది. పదకొండు జతల కల్లూ నిరాశగా చుస్తుండగా, రాత్రి నుండీ ఆగకుండా సాగిన కోరికెలకు, ఆషతో వాలిన కంటి చూపులకు, చేతి స్పర్షలకూ, ముద్దులకూ విసిగిపొయిందా అన్నట్టుగా తన జిగేలుని కొద్దిగా కోల్పోయి అలమారాలో పడి ఉన్న నెక్లేసుని తీసుకుని రఘుపతీ, రాఘవా తమ పాత మోటరు బైకు మీద జువెల్లరీ షాపుకి బయల్దేరారు.