Telugu Version (There is an english version below):
ఎదుగుతున్న మనిషి మేధోశక్తి తో పాటుగా అవసరాలూ, అవసరాలకి మించి విలాసాలూ, ఈ రెండింటికి సమాంతరంగా సౌకర్యాలూ నిరంతరం మారుతూ వచ్చాయి. మార్పుకై అన్వేషణ తరాలుగా కొనసాగుతూనే ఉంది. చక్రాన్ని కనిపెట్టాడు. ఆవిరి యంత్రాన్ని కనిపెట్టాడు. రెండిటినీ జోడించి పొగ రైలుని కనిపెట్టాడు. అక్కడితో ఆగక మరింత మెరుగైన ఎలెక్ట్రిక్ ట్రెయిన్ని, ఆ తరువాత గంటకి 400 కిలో మీటర్లు పై చిలుకు వేగం తో ప్రయాణించే మాగ్నటిక్ ట్రెయిన్నీ కనిపెట్టాడు. మర యంత్రం నుండి మర మనిషి వరకు, పూరి గుడిసెల నుండి ఆకాశ హర్మాల వరకు... ఇలా గమ్యం లేని ప్రయాణం కొనసాగుతూనే ఉంది. ఈ పయనంలో భాగంగానే మనిషి లోపభూయిష్టమైన వస్తు మార్పిడి విధానానికి చక్కటి ప్రత్యామ్నాయంగా డబ్బుని కనిపెట్టాడు. ఉప్పుకి పప్పు, ఉల్లికి వెల్లుల్లి అన్నట్టు కాకుండా ప్రతి వస్తువుకీ, ప్రతి సేవకీ ఏకైక కొలామానంగా డబ్బుని సృష్టించాడు. ఇదే ప్రాథమిక సూత్రం డబ్బుని మానవ జీవితాన్ని శాసించే అత్యంత ప్రమాధకర శక్తిగా మార్చింది. అలాంటి డబ్బుకి ఒక రూపమే "రూపాయి".
ఎక్కడో కర్ణాటకా ఉక్కు గణుల్లో వెలికి తీయబడి, ఊత్తర ప్రదేశ్ లోని రిజర్వు బ్యాంకు ఫ్యాక్టరీ (మింట్) లో కొరియా నుండి దిగుమతి చేసుకున్న మిషనరీలో రూపాయిగా రూపాంతరం చెంది, ఢిల్లీ గుండా ఆంధ్ర ప్రదేశ్ చేరుకున్న ఒక రూపాయి ఆత్మ కథే ఈ "రూపాయి" -
మూడు రోజులుగా ఇదే బ్యాంకు ట్రెజరీ లో మగ్గి ఉన్నా. పరిస్థితి చూస్తే అసలు బయటకి వెలతాన లేదా అన్న అనుమానం రోజు రోజుకీ బలపడుతూఉంది. నా కోసం మనిషి పడే తపన, వేసే వేషాలు, ఆడే నాటకాలు, నేను లేక పడే బాధ, నేనున్నప్పుడు చూపే గర్వం ఇవ్వన్నీ చూడాలని మిక్కిలి ఆరాటంగా ఉందిగానీ, వచ్చిన ప్రతి వాడికీ వేలు, లక్షల్లోనే అవసరాలున్నాయ్. మరి ఒక్క రూపాయిని, నా అవసరం ఎవరికొచ్చేది, నన్నెవరు తీసుకునేది ? ఏ బికారి ఖాతాదారో కరుణిస్తే తప్ప నాకు బయటికి వెళ్ళే అవకాశం రాదేమో అనుకున్నా గానీ నా అదృష్టం ఇలా పేరు మోసిన వ్యాపారి రఘురాం రూపంలో వస్తుందనుకోలేదు.
రఘురాం పట్టణంలో టాప్ ఫైవ్ వ్యాపారుల్లో ఒకడు. మూడు నాలుగు రకాల వ్యాపారాలు చేస్తుండడం వల్ల తనకి ఎప్పుడూ బ్యాంకు తో పని ఉంటుంది. కానీ ఎంతో అవసరం ఐతే తప్ప తానే స్వయంగా బ్యాంకుకి రాడు. తను కొత్తగా స్టార్ట్ చేయబోతున్న ఆటో మొబైల్ వ్యాపారానికి మొదటి పెట్టుబడిగా తన సేవింగ్స్ అకౌంట్ నుండి ఒక రెండు లక్షలు విత్ డ్రా చేద్దామని ఇలా వచ్చాడు. ఈ వ్యాపారాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం వల్ల సెంటిమెంటుగా తనే స్వయంగా వచ్చాడు. ఇలాంటి సెంటిమెంటే మరొకటి కూడా వుంది. ఆ సెంటిమెంటే ఈ రోజు నా అదృష్టంగా మారింది. ముఖ్యమైన ఏ పని కోసమైనా రఘురాం అవసరమైన డబ్బు తో పాటుగా మరొక నూటా పదహారు రూపాయలు ఎక్స్ట్రా విత్ డ్రా చేస్తాడు. అలా అవసరమైన ఆ రెండు లక్షలా నూటా పదహారు రూపాయలలో ఆ చివరి ఒక్క రూపాయి కోసం క్యాషియరు సీల్డు కవరు లో ఉన్న నన్నూ, నాతో పాటు ఉన్న మరో తొంభైతొమ్మిది రూపాయి నాణేల్ని బయటికి తీసి డెస్కు లో వేసి, నా పక్కనే పడి ఉన్న నాణెన్ని తీయబోతూ, ఎదో పనికై చేయి పైకెత్తి మళ్ళీ రెండవ ప్రయత్నంలో నన్ను తీసి రఘురాం చేతిలో పెట్టాడు. తీసుకోబోతుండగా చేయి జారి నేలపై పడ్డ నన్ను పైకెత్తి రెండు కళ్లకీ అద్దుకొని మరీ జేబులో వేసుకున్నాడు. అలా మొదలైంది మనిషితో నా ప్రస్థానం !!
ఇంటికెళ్ళిన రఘురాం నన్ను చిల్లర డబ్బాలో పడేసి ఏదో పనికై బయటికెళ్ళాడు. పాతవి, ఇంకా పాతవి, అరిగిపోయినవి, కాంతిహీనమైనవీ ఐన నాణేల మధ్య ఉండడం నా వల్ల కాలేదు. నా వెలుగులు చూసి వాటికి అసూయ, వాటి మీద నాకు అసహ్యం కలగడం వల్ల మేము అస్సలు మాట్లాడుకోలేదు. సాయంత్రం అవుతుండగా స్కూలు నుండి ఇంటికి వచ్చిన తరుణ్ ఎదో చాకోలేట్ కావాలని ఏడిస్తే ఇంక వేగలేక కస్తూరి చిల్లర డబ్బాలో చేయి పెట్టి మెరుస్తూ తన దృష్టినాకర్షించిన నన్ను అప్రయత్నంగానే బయటకి తీసి తరుణ్ చేతిలో పెట్టింది. కొత్తోడా మజాకానా !!
అప్పటి వరకూ మొహం మాడ్చుకుని ఉన్న పిల్లాడు నేను చేతిలో పడగానే ఒక్కసారిగా ఏడుపు ఆపి ఎంతో ఉత్సాహంగా చాకొలేట్ షాపు కి వెళ్ళాడు. పిల్లాడి మొహంలో ఆనందం వల్ల వచ్చిన తేజస్సు చూసి మొదటి సారిగా నా అస్థిత్వానికి గర్వపడ్డాను.
షాపు ఓనరు 'ఎన్ని ?' అని అడిగాడు.
పిల్లోడు 'మూడు ' అని బదులిచ్చాడు.
'మొత్తం ఆరు రూపాయలవుద్ది ' చెప్పాడు షాపు ఓనరు.
ఎంత వేగంగా వచ్చాడో అంతే వేగంగా వెనక్కి వెల్లాడు పిల్లాడు, నిరాశగా. విషయం కస్తూరికి చెబితే కస్తూరి విసుక్కుంటూ మళ్ళీ చిల్లర డబ్బాలో చేయి పెట్టి మరో ఐదు రూపాయి నాణేలిచ్చింది. ఈ సారి పిల్లాడు మరింత ఆనందంగా పరిగెత్తుకుంటూ వెల్లాడు. ఇంకా ఆనందంగా తిరిగి వచ్చాడు, చాకోలేట్లతో. ఏ నాణేల్ని పాతవని అసహ్యించుకున్నానో వాటి వల్లే నా విలువకు పరిపూర్ణత చేకూరింది. అప్పుడే నాకర్థమైంది, 'టు గెదర్ వీ రాక్ ' అని. ఆ మీదట వాటిపై నాకు అసహ్యం కలగలేదు.
ఆ పై రెండు గంటల్లో రెండు మూడు చేతులు మారి, చివరకి యాదగిరి చేతిలో పడ్డాను. యాదగిరి రోజు కూలీ హమాలీ పనివాడు. కాయ కష్టం చేస్తే రోజుకు రెండు వందలు సంపాదిస్తాడు. కలిసి వస్తే మరో వంద. ఈ సంపాదన తోనే రేకుల ఇంటిని డాబా ఇంటిగా మార్చాలని, తన కొడుకుని బాగా చదివించాలని ఇంకా ఎన్నో కోరికెలూ, ఆశలు. ఒక్కొక్క రూపాయి కోసం కేజీలకి కేజీల బరువులు మోయాలి. ఐనా ఆరోగ్యం బాగలేక పొయిగాని, మరే కారణం చేతగానీ ఒక నాలుగు రోజులు పని మానేస్తే అంతా తలక్రిందులవుతుంది. ఈ మాత్రం పనికి కొన్ని వందలమంది పోటీ !! అప్పుడే అర్థమైంది నా విలువ ఏమిటో.
పని పూర్తయ్యాక యాదగిరి ఇంటికి వెళ్తూ, దారిలో మధ్యలో వచ్చే ఒక సారాయి దుకాణం దగ్గర ఆగాడు. సరే, ఒక్క నలభై రుపాయలే అనుకున్నాడు. నలభై వంద అయ్యింది, వంద నూటాయాభై అయ్యింది. నిటారుగా వున్న తను ఏటవాలయ్యాడు. రోజంతా కష్టపడి సంపాదించిన సొమ్ములో మూడవవంతు ఒక్క అర గంటలో ఖర్చు చేసాడు. సొంత ఇంటినీ, పిల్లాడి చదువునీ, భార్యకి ఇచ్చిన మాటనీ, అన్నింటికీ మించి ఎనమిది గంటలపాటూ ఓడ్చిన చెమటనీ మరిచి !! అసలు నా విలువ ఏంటి ?
అది శ్రీశైలం లిక్కర్ షాప్. పర్మిట్ ఉంది కేవలం సారాయికే గానీ దానితో పాటూ బ్రాందీ, విస్కీ, బీరు, కల్లూ, కల్తీ కల్లూ.... ఇలా అన్ని రకాల మధ్యం అమ్మబడుతుందక్కడ. రెండేళ్ళలో మూడు సార్లు రైడ్లయ్యాయి. ఇంకా కొత్త గవర్నమెంటు వస్తే ప్రొహిబిషన్ వస్తుందేమోనని భయం. పైగా మధ్యం అమ్మడం పాపం అని, చనిపోయాక నరకంలో తనచేత మల్లీ చచ్చే వరకు మధ్యం తాగిస్తారని ఒక దిగులు. ఈ కారణాలన్నింటి చేత ప్రతీ నెలా పోలీసు వాడికీ, ఎక్సైజు వాడికీ, కార్పోరేటరుకీ ఇచ్చినట్టుగానే దేవుడికి కూడా దర్శనం రూపంలో శ్రీశైలం వెళ్ళి మామూలు అప్పజెప్పడం అలవాటు. ఈ నెల పని వత్తిడితో కుదరక పోవడం వల్ల ఈ పని తన భార్య సుజాతకి పురమాయించాడు.
తను వెళ్తూ వెళ్తూ దారిలో హుండీకి చిల్లర కావాలని షాపు వద్ద ఆగింది. అలా నేనుకూడా తనతో శ్రీశైలం బయలుదేరడం జరిగింది. హుండీలో కొన్ని లక్షల డబ్బుంటుంది. డబ్బుతో పాటూ బంగారు నగలు. కేవలం లెక్కించడానికే కొంతమంది ఉద్యోగులు. తలుచుకుంటేనే ఎంతో ఆసక్తిగా ఉంది.
దాదాపు గంట సేపు లైనులో నిల్చోగా తన వంతు వచ్చింది. కోరికెల చిట్టాని సగం కూడా విన్నవించుకోక ముందే పూజారి ఇంక కదలాలంటు హెచ్చరించాడు. కోరికెల చిట్టాని కొనసాగిస్తూ హుండీ వద్దకు చేరుకొని తన బ్యాగులో చేయి పెట్టింది. ఒక వంద రుపాయల నోటుని తీసి దేవుడి విగ్రహానికి చూపించి మరీ లోపల వేసి బయటికి వెళ్ళ సాగింది. ఇంక నా ఆశలు అడిఆశలయ్యాయని నాకు అర్థమయ్యింది. గుడి బయట మెట్ల మీద ఉన్న బిచ్చగాళ్ళని చూసి తను ఆగినప్పుడు అర్థమయ్యింది, తను చిల్లర ఎందుకు తీసుకువచ్చిందో. మాసిన గడ్డాలు, చిరిగిన బట్టలు, ముసలి వాళ్ళు, పిల్ల తల్లులు, తల్లులు లేని పిల్లలు... వచ్చిన ప్రతీ వారిపైన ఎగ పడుతున్నారు. డబ్బులిస్తే సంతోషిస్తున్నారు. ఇవ్వని వాళ్ళని వినపడేలా, తక్కువ మొత్తం ఇచ్చిన వాల్లని వినపడనట్లుగా తిడుతున్నారు. వీళ్ళ చేతికి వెల్లడం నాకేమత్రం ఇష్టం లేదు కానీ వెళ్ళక తప్పేలా లేదు. ఒక ఇద్దరు ముగ్గురికి కొంత సొమ్ము ఇచ్చాక ఇక లేదంటూ ముందుకు వెళ్ళ సాగింది సుజాత. వెనకనుండి ఆశతో చూసిన చూపులు కొన్ని నన్ను గుచ్చుకున్నాయి.
దాదాపు ఊరి చివరిదాకా వెళ్ళాక బ్రిడ్జి మీద సుజాత డ్రైవరుని ఆపమని చెప్పి ఏదో మనసులో మొక్కుకొని నన్ను సరస్సులోకి ఒక్క విసురు విసిరింది. తన ఛాదస్తమేమోగానీ ఊహించని ఈ పరిణామానికి నేను నిశ్చేష్టుణ్ణయ్యాను. నా జీవితం ఈ రకంగా ఎక్కడో సరస్సు లోతుల్లో అంతమవబోతున్నందుకు భాధ వేసింది. కానీ మరో ఊహించని పరిణామం. నది ఒడ్డు అవడం వల్ల అక్కడ పేరుకొని ఉన్న చెత్త మీద పడి, దానితో పాటుగా ప్రవహించి చివరకి ఒక పిల్లకాలువ గుండా పక్కనే ఉన్న బస్తీ మురికికాలువలోకి చేరుకున్నా. సరిహద్దు వద్ద సైనికుల్లా ఇద్దరు కుర్రాళ్ళు అయస్కాంతపు పట్టీ ఉన్న కర్రలని కాలువ చివర నీటిలో అదిమివుంచి వచ్చిన ఉక్కు, ఇనుముని జమచేస్తున్నారు.స్నేహితుల్లా ఉన్నారు. సరదాగా మాట్లాడుతూ దూరంగా వస్తున్న చెత్త కుప్పని చూసి ఆశగా నవ్వుకున్న వాళ్ళని చూస్తే నాకు సరదా వేసింది. తుప్పు పట్తిన ఇనుపరేకులు, చీలలు, పిన్నీసులు, మరికొంత చిల్లర డబ్బుతో పాటుగా నేను వచ్చి ఒక అయస్కాంతానికి చిక్కుకున్నాను. ఒకే సమయంలో, ఒకే చోట ఇద్దరూ పెట్టడం వల్ల ఇది నాదంటే నాదని ఇద్దరికి గొడవ జరిగింది. గొడవ తోపులాటగా మారింది. మొదటి వాడి తల గట్టిగా గోడకి గుద్దుకోగా రెండోవాడు దొరికింది దొరికినట్లుగా తీసుకొని పారిపోయాడు. రక్తం సాక్షిగా ఇద్దరు స్నేహితులకి గొడవ పెట్టిన ఘనత నాకే సొంతం !!
పెద్దగా, గుండ్రంగా గిరి గీసి అందులో ఒకడు కొన్ని రూపాయి నాణేల్ని వేస్తాడు. చుట్టు ఉన్నవాళ్ళు తమలో తాము మాట్లాడుకొని ఒక నాణెం వైపు వేలు చూపిస్తారు. మొదటి వ్యక్తి మొనతేలి ఉన్న ఒక చిన్న రాయితో వేలెత్తి చూపించిన నాణేన్ని కాకుండా మరేదైనా నాణేన్ని గురి చూసి కొడతాడు. అది ఎగిరి వృత్తానికి బయటగా పడితే అందులో ఉన్న నాణేలన్నీ తన సొంతమైనట్లు. లేకుంటే రెండో వాడి వంతు వస్తుంది.క్లుప్తంగా ఇదీ ఆట. వీళ్ళ ఆట పుణ్యమా అని గత రెండు గంటలుగా ఎప్పుడు దెబ్బ తగులుతుందా అని భయం భయంతో వణికిపోసాగాను. నలుగురైదుగురి చేతులుమారాక వేచివున్న సమయం రానే వచ్చింది. గేదెలా దిట్టంగా ఉన్న ఆ కుర్రాడు తన శక్తినంతా ఉపయోగించి ఒక్క పెట్టు పెడితే నాలుగు మీటర్ల దూరం ఎగిరిపడ్డాను. కుడివైపుగా పెద్ద సొట్ట పడింది. కుర్రాడు సొమ్మంతా తీసుకొని పరిగెత్తాడు దగ్గరలో ఉన్న ఖిళ్ళీ కొట్టుకి. ఫోను కాల్ రూపంలో కుర్రాడితో పాటే ఒక చావు కబురు కూడా వచ్చింది ఖిళ్ళీ కొట్టు వాడికి. గత పన్నెండు రోజులుగా హాస్పెటల్లో కాన్సర్ ట్రీట్‌మెంట్ పొందుతున్న తన తండ్రి మరణించాడని, అర్జెంట్‌గా బయలుదేరి రావాలని కబురు. మొహంలో పెద్దగా విషాదంలేదు. ఏదో ఊహించిన విషయంలానే చాలా కాషువల్‌గా సరే బయలుదేరుతున్నాని చెప్పి దుకాణం మూసేసే పనిలో పడ్డాడు. విషాదం, ఆనందం, ఉత్సాహం, ఆందోళన... ఇలా ఎలాంటి భావోద్వేగం కనిపించలేదా మొహంలో.
సాయంత్రం మూడయ్యే సరికి రావల్సిన బంధువులంతా చేరుకున్నారు. తండ్రి బాధ్యత తనవంతుగా ఉన్న సమయంలోనే మరణించాడు కనక ఖర్చంతా పెద్ద కొడుకే పెట్టుకోవాలని చిన్న కొడుకు వాదించాడు. తనకి ఎప్పుడూ వాటా ఇస్తానని తండ్రి అనే వాడని, ఆ విషయం ఇప్పుడే తేలాలని కూతురు వాదించింది.
ఇతరులు చూస్తున్నారని కొంత సేపు, నిజంగా బాధవల్ల కొంత సేపు ఏడ్చిన తరువాత జరగవలసిన పని మొదలుపెట్టారు.
శవం మీద చిల్లెర జల్లి, ఆస్తుల్ని పంచుకున్నారు. దారిన వెల్లిన ప్రతీ ఒక్కడు కాలితో తొక్కగా ఒక రెండు రోజులు గడిచాక ఒక కంసలివాడి చేతిలో పడ్డాను. ఒక నాటు వైద్యుడు తన వద్దకి ఒక తండ్రి, పదేళ్ళకి మించి ఉండని కొడుకుతో సహా వచ్చాడు. ఒక రెండు నిమిషాలు ఏదో మాట్లాడాక కంసలి బయటికి వచ్చి కొలిమి నిప్పంటించ్చాడు. ఎర్రటి మంటలో నన్ను సల సల కాలేదాకా ఉంచి వైదుడికిచ్చాడు. భయంతో వణికి పోతున్న పిల్లాడిని తన తండ్రి గట్టిగా అదిమి పట్టుకోగా వైద్యుడు కుర్రాడి వైపు నడవసాగాడు. పసివాడి ఆర్థనాదాలకి తోడుగా మనిషి మూర్ఖత్వానికి సాక్షినయ్యాను.
ఆ మరుసటి రోజు కంసలివాడి కొడుకు ఆడుకోవడానికని రైలు పట్టాల వద్దకి వెళ్ళి ఎదురుగా వస్తున్న రైలుని చూస్తూ రైలు పట్టాల మీద నన్ను పెట్టాడు. రైలు బుల్లెట్ వేగంతో నా వైపు కదిలి వస్తుండగా పసివాడి కళ్లలో ఆనందాన్ని చూస్తూ, అచ్చు యంత్రపు ఇనుప కమ్మీల మధ్య వత్తిడికి నేర్పుగా రూపందాల్చిన నేను ఇప్పుడీ రైలు ఇనుప కమ్మీల పైన రైలు చక్రాల వత్తిడికి రూప విహీనుడనయ్యాను.
అసూయ, గర్వం, తృప్తి, ఆనందం, విచారం, ఆవేదన, అసహ్యం.. ఎన్నో మరువలేని గుర్తుల్నీ మిగిల్చిన నా ప్రస్థానం చివరికి ఇలా ముగిసింది.
English Version:
In parallel with the rapidly growing power of human mind, his needs, in addition his
luxuries and along with these the living standards kept growing. He invented wheel. He invented steam engine. Fitting these two together, he invented steam train. He later went on to invent electric train and now the magnetic train that travels as fast as 300 miles per hour. Such, this endless journey of the search for 'change' has been in tact for generations. As part of it, replacing the faulty Barter, he
invented the concept of money, an entity that stands as the single universal measure of value for any goods or services. But this very basic principle made money so dangerously powerful that it could dictate the phase of the mankind. One of the many forms of such money is Indian Rupee (INR), in short Rupee and this is the story of one such One Rupee coin that was made out of the metal extracted from the mines of Karnataka, molded to its shape in the India Government Mint in Uttar Pradesh by the machinery imported from South Korea, and is shipped from New Delhi to this bank in Andhra Pradesh where it is now, in its own words -
I have been very curious to get out of here into the human world and see the pride in
their faces that my presence brings, the pains that they go through in my absence, the gimmicks they play to get me into their pockets. But as days pass by, my feeling that I will be remaining in this treasury for ever is getting stronger. People come, take money and go but everyone wants thousands and lakhs, not me. Nevertheless, I
never guessed that my fortune walks in the form of Raghu Ram, one of the richest businessmen in the town. He has at least four successful businesses but never visits the bank himself unless the work has some specific importance. He is starting a new auto mobile business and took it as a prestigious deed. So, as a sentiment, he wanted to withdraw the first investment by himself. He has one such another
sentiment and that is what got me out to the world along with him. He withdraws a denomination that ends with a hundred and sixteen rupees for any need that is significantly important and that is 2,01,116 rupees today. To pick that last one rupee, the cashier unpacked a bundle of one rupee coins and put them in the cash counter. In an attempt to pick me up, he picked another one rupee coin and dropped
it back as he had to take a phone call. Finishing the phone call, he picked me up this time and handed over to Raghu Ram. Touching me to his eyes for dropping me on the floor by mistake, slipped me into his pocket. There started my real journey with the human world.
As he arrived home, he placed me in the little cash box and went out on work. Old,
stained, out of shape and stinky.... I hated the fellow coins in the cash box for their ugliness and they felt jealous of me for my beauty. Raghu Ram's son Tarun arrived from school in the evening and nagged Kasturi, his mother for a rupee to buy candies. After resisting for a while, Kasturi gave up and opened the cash box. Without effort, her hand picked me up. After all, I'm new !!
Tarun ran to the nearby candy shop and came back in the same pace, disappointed. Each piece of candy costs two rupees and he couldn't buy any. Kasturi gave him
another five one rupee coins from the same cash box. Tarun once again, ran fast to the candy shop and came back even faster, with smile on his face. For the first time, I felt proud of myself and thanked the fellow coins for bringing me completeness. I figured that 'together we rock' and never in my life hated them again.
In the next two hours, after moving into the hands of few people I ended up in
Yadagiri's hand. Yadagiri is a daily wage hamali labour. Works like a machine for eight to ten hours a day and makes two hundred rupees and upto another hundred extra, if luck favors at all. With that little earnings, his family have plans to shift out of the slum, to get their son well educated, and many more. It is such a great hard work he has to go through and a single day sickness upsets their financial
balance. And for such a painful job, there are hundreds waiting in the queue. This tells what my value is !!
He collected wage after finishing his work for the day and started to home. On his way back home came into his sight, a liquor shop. He couldn't resist the
temptation and decided to spend only 50 rupees. Fifty turned to be hundred and hundred turned to be hundred and fifty. He spent three fourth of the money he earned just in one hour forgetting his wife's words, forgetting his son's education, and above all the pain he went through the whole day to make that money. Do I really have any value ?
That is 'Srishailam Liquor Shop'. With the permit to sell cheap liquor, they
sell cheap liquor, impure cheap liquor, beer, whisky and brandy. Inspite of paying monthly bribes to the excise officers, there is a threat of random rides, and also the tension of alcohol prohibition by the new government after the elections. In addition to all these, the owner of the shop is also worried that he will be tortured to death in the hell after his death for selling liquor. To get relief from all these hassles and tensions, he also pays Srishailam Mallanna (a Hindu god) a monthly bribe. As he is quite a bit busy with business this month, he had decided to send his wife Sujata this time to Srishailam on his behalf.
She stopped by at the liquor shop while on her way to Srishailam and picked some rupee coins up. There are lakhs of money in the Hundis (locked boxes in
temples where divotees drop their offerings). Also kgs of gold. It took Sujata one hour in the queue. She started listing her wishes out and after waiting for a minute the priest told her to move ahead to accommodate the other devotees. She approached a nearby Hundi and opened her purse. I'm excited. She picked up a hundred rupee note
and showing it to the statue of god, dropped into the hundi leaving me in disappointment. With torn clothes, long beards, age old people, motherless children, mothers with children as young as 2 months... there are hundreds of beggars on both sides of the steps.
Sujata took few coins out, including me. I wasn't happy to get into that dirt but hadn't had a choice. She distributed few coins to some of the beggars and then skipped the rest. Thank god, I wasn't out. Sujata moved ahead fast as the sight of few eyes hit me in disappointment.
While I was thinking if I will be back into the Liquor shop again being in
Sujata's purse, her car stopped on a bridge and she opened the purse taking me out. She went out, whispered something in her mind and tossed me into the lake. Having no time to feel disgusted of her stupidity, I fell into the lake. I never imagined that my life would be ending in a lake like this. But unexpectedly in a short time, a
bunch of garbage captured me into it as it moved ahead towards a drain. Far in sight, two young boys apparently friends talking to each other, staying at the edge of the drainage on opposite sides, like solders at the border holding sticks got alerted as they saw the garbage and immersed the tips of the sticks that has the magnetic strip attached. Along with me, few other coins and other iron pieces
got stuck to the magnets. As both the sticks were held together at the same place, they got into a dispute on what belongs to whom and that finally led to a fight. The first one pushed after the other forcibly towards the electrical pole and ran away. As the head was hit to the pole hard, the place was left with blood. This credit, of
igniting a fight between two close friends in a fraction of minutes goes solely to me, the money !!
It is a big circle drawn on the floor with sand. One of the contestants throws a bunch of coins into it. After discussing for a while, one among the remaining contestants points his finger at one of the coins. With a sharp little stone, the first player should now hit any of the coins other than the one that's pointed out. If he could get one of those coins out of the circle, he wins the game and gets all the coins. If not, the game repeats with the next player until someone wins. This
is the game in short. I have been living in fear for past one hour scared of the stone stroke and the time has come. Tall and hefty, this guy looking so angrily at me threw the stone with a great force and I fell four feet away with the power of the stroke. It was so painful and left a mark on my curvy edge. Picking me along with all other coins, he ran to a nearby pan shop to buy something.
Along with a phone call, the shopkeeper also got a bad news. His father who has been in the hospital for last 10 days has passed away. He replied saying that he will be there as soon as possible. Grabbed some cash from the counter, closed the shop and started to the hospital on his scooter. There is no sign of emotion what so ever on his face. As the clock struck three in the afternoon, most of the relatives arrived. The elder son argued that the funeral expenses should be borne by the younger son. Daughter argued that she deserves a share in her father's wealth.
They cried for some time. They pretended that they cried for some more time and
finally started the ritual. Throwing mere loose change on the dead body of their father, they shared the whole assets earned by the old man. After being stumped by everyone who passed by, I grabbed the attention of a gold smith. A country doctor (natu vaidhyudu) approached him the next day morning, along with a man and his son who is around 12 years old. The doctor spoke with the goldsmith for few minutes. The goldsmith went inside, arranged fire and burnt me until I turned red. As the father and the goldsmith held the hands of the boy who is shivering in fear, the doctor approached closer. While the boy shouted in pain, I remained as the witness for the stupidity of the man.
The next day, the goldsmith's son took me to and placed on railway tracks. The train
approached as a bullet. Jealous, pride, satisfaction, sorrow, guilt and disgust.... as each experience remained as a unique memory, I ended my life looking at the happiness in the eyes of the boy.