Saturday, April 24, 2010

గణపతిం భజే !! - My first written short story...

Telugu version (there is an english version at the end) :

అది ఒక కోటి ఇరవై తొమ్మిది లక్షల డెబ్బయ్ ఎనిమిది వేల నూటాఎనభై తొమ్మిదో వినాయక చవితి. ఆ సంఖ్య అప్పటికి గుర్తించబడ్డ అతి పెద్ద ప్రధాన సంఖ్య (లార్జెస్ట్ నోన్ ప్రైం నంబర్). చదువుల్లో ఘణాపాటి ఐన గణపతి కి అది ఎంతో స్పెషల్ గా తోచింది. ఫ్రెండ్స్ అందరిని పిలిచి ఈ స్పెషల్ బర్త్ డే ని చాలా స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాడు. కానీ ఆ ఫ్రెండ్స్ కి ఇదే రోజు ఇంద్రలోకం లో జరుగుతున్న తిలోత్తమ – 70921 డెబ్యూ డాన్స్ షో మరింత స్పెషల్ గా అనిపించడం తో ఎస్ ఎం ఎస్ లు, ఈ మెయిల్స్ తో వినాయకుణ్ణి సరి పెట్టి డాన్స్ షో కి చిత్తగించారు. ఈ విషయం తనని చాలా అసహనం, అశాంతి, ఆవేషం లాంటి రక రకాల ఎమోషన్స్ కి గురి చెసింది.

రెండవ తరం కింగ్ జార్జ్ ని కింగ్ జార్జ్ II అంటే ఇది ఇప్పటి తిలోత్తమ పేరు.

తనని పట్టించుకోని ఈ లోకం నుండి తనకు దేవుడి హోదాలో రెస్పెక్ట్ లబించే భూలోకం వెళ్తే ఎలావుంటుంది ? అదీ కాక ఎప్పటి నుండో భక్తుల కోరికలని ప్రత్యక్షంగా విని తీర్చాలని ఒక సరదా వుండేది. ఇంకేం, రెండు విధాలా మంచి అలోచన లా తోచడం తో మారు మాట ఆలోచించకుండా భూలోకం లోని విశాఖపట్నం సివార్లలో వున్న తన గుడి ఒక దానికి బయల్దేరాడు. ఈ విషయం ఎవ్వరికి చెప్పలేదు. చివరికి తన వాహనం ఎలుక కి కూడా. ఏలుకకి చెబితే రైడ్ ఇస్తా అంటుంది, అలా వెళ్తే విశాఖపట్నం చేరుకునే సరికి నెక్స్ట్ బర్త్ డే వస్తుంది!!

ఉదయం ఎనిమిది, ఎనిమిదిన్నర ఆవుతుంది. బయట డి విటమిన్ ఎండ కొడుతోంది. పండగ కారణంగా గుడి చాలా శుభ్రంగా వుంది. బయట చల్లటి గాలి వీస్తుందిగానీ అది గుడి లోపలికి వచ్చి, తన మంటపానికి చేరుకునే సరికి వుక్కపోత గా మారింది. ఇంత ఖర్చు పెట్టి కట్టారు గుడి, లోపల ఒక్క ఫ్యాన్ పెట్టించొచ్చు గా అని మనసులో అనుకున్నాడు గణపతి. బయట పక్షుల కీచు కీచు షబ్దానికి లోపల పిల్లల కేరింతలు జోడీ అవడంతో వచ్చిన షబ్దం ఎంతో అహ్లాదంగా వుంది. బాలక్రిష్ణ దో చిరంజీవి దో సరిగ్గా తెలియదు గాని ఎక్కడో దూరంగా ఏదో ఇంగ్లిష్ పాటని కాపీ కొట్టి చేసిన ఒక తెలుగు మాస్ సినిమా పాట ఒకటి వినిపిస్తుంది. ఇన్ని షబ్ధాల మధ్యా గుక్క తిప్పుకోకుండా పూజారి చదువుతున్న మంత్రాలు ఎంతో ముచ్చటగా వున్నాయి. తను పలుకుతున్న పదాల్లో దాదాపు సగం పదాలు ఒరిజనల్ సంస్ఖ్రుతం పదాల కి కిలొ మీటరు దూరం లో వుండడం వల్ల వాటి భావం అర్థం అవట్లేదు గాని మంత్ర ఉఛ్ఛారణ లో రిథం మాత్రం విన సొంపుగా వుంది. మాటి మాటికి మీద పడుతున్న అక్షింతలు, తులసి తీర్థం కాస్త విసుగు పుట్టిస్తున్నా భక్తులు పెద్ద సంఖ్యలో రావడం, మొక్కుకోవడం,కానుకలు ఇవ్వడం, వెళ్ళడం వగైరా తతంగం ఎంతో ఆనందంగా, ఈగో సటిస్పైంగ్ గా తోచింది.

ఇక వచ్చిన పని మొదలెడుదాం అనుకుంటుండగానే ఒక యువ భక్తుడు గంట కొట్టి మరీ తన కోరికని చెప్ప సాగాడు.

'స్వామీ, గత తొమ్మిది రోజులుగా క్రమం తప్పకుండా ఇదే టైం కి గుడికి వస్తున్నా...
మొన్నీమధ్యే పూర్తైన ఫైనల్ ఇయర్ పరీక్షల్లో అన్ని సబ్జెక్ట్లూ బాగా రాశా గానీ ఒక్క కెమిస్ట్రీ మాత్రం పోయేలా వుంది....

నువ్వు ఆ ఒక్క సబ్జెక్ట్ పాస్ అయ్యేలా చేస్తే చాలు, ఈ జీవితంలో ఇంకేమీ అడగను....

నా తప్పు కూడా ఏం లేదు స్వామీ...
వరసగా నైటౌట్లు చెయ్యడం వల్ల పరీక్ష ముందు రోజు 103 జ్వరం వచ్చింది. ఆందుకే బాగా రాయలేక పోయా.....!!'

ఇదీ ఆ యువ భక్తుడి కోరిక అతడి మాటల్లోనే.

విన్న వెంటనే గణపతి తన లాప్ టాప్ బూట్ చేసి డేటాబేస్ అర్కైవ్ నుండి ఆ భక్తుడి రికార్డు తిరగేసాడు. అతను చెప్పినట్టే ఇదే కోరిక కోరుతూ 9 రోజులుగా క్రమం తప్పకుండా గుడికి వస్తున్నాడు. పరీక్ష కూడా అనుకున్నట్టుగానే 3 మార్కుల తో పోయేలా వుంది. జ్వరం 103 కాదు, జస్ట్ మైల్దు ఫీవరు. ఈ ఒక్క విషయం తప్పించి మిగతా అంతా చెప్పింది చెప్పినట్టు గానే వుంది. నిజయితీ గా వున్నాడు, తొమ్మిది రోజులు గా తిరుగుతున్నాడు, పైగా కలపాల్సింది ఒక్క మూడు మార్కులే. కాబట్టి ఈ కొరికని సుబ్బరంగా తీర్చొచ్చు అనుకొని దానికి సంభందించిన సాఫ్ట్ వేర్ ని లాంచ్ చేసాడు. లేటెస్టు అప్ గ్రేడ్ చేసినప్పడి నుండి విండోస్ విస్టా లాగా బాగా స్లో అయ్యింది అప్ప్లికేషన్.

కావాల్సిన డేటా ఎంటెర్ చేసి సబ్మిట్ బటన్ నొక్క బోతుండగా 'స్వామీ, స్వామీ....' అంటూ ఆత్రుత గా మళ్ళీ ఏదో చెప్ప సాగాడు భక్తుడు.

'స్వామీ, పరీక్షలు ఇప్పుడు కాక పోతే మళ్ళీ రాసుకోవచ్చు,
కానీ ఫ్రేమ అలా కాదు.ఒక్క సారి పోతే మళ్ళీ రాదు.

ఆదిగో,
ఆ మెరుపు డ్రెస్సు లో మెరుపు తీగలా వున్న ఆ అమ్మాయి పై తొలి ప్రేమలో పడ్డా.

దేవుడివి, నీకు అబద్దం చెబుతానా ?

ఏది ఏమైనా, నువ్వు నా ప్రేమని సక్సెస్స్ చెయ్యాలి. జీవితంలో ఇంకేమీ అడగను,
ప్లీ.....జ్'.

ఇదీ.... మళ్ళీ అతని మాటల్లోనే అతను పెట్టిన చేంజ్ రిక్వెస్టు.

అదేదో సినిమాలో చెప్పినట్టు మైండు బ్లాక్ అయ్యి దిమ్మ తిరిగింది గణపతికి. "జీవితం లో ఇంకేమీ అడగను" అని రెండు నిమిషాలైనా అవకముందే మళ్ళీ అదే మాటను వాడి మరో కోరికని విన్నవించుకోవడం ఈ మైండ్ బ్లాకింగ్ కి సగం కారణం ఐతే 9 రోజులుగా క్రమం తప్పకుండా ఒక దీక్ష లా ఏ కోరిక కోసమైతే ఇంత కష్ట పడ్డాడో, రెండు నిమిషాల్లో అదే కోరికని మార్చడం మరో సగం కారణం.

నా మైండ్ బ్లాక్ సంగతి అలా వుంచి వీడి మైండ్ బ్లాక్ చేసిన ఆ అమ్మాయ్ ఎవరా అని గణపతి అటు వైపు తిరిగి ఆ అమ్మాయిని చూసాక ఎందుకో అతడు మాట మర్చడం పెద్ద అశ్చర్యంగా అనిపించలేదు. చాలా చక్కగా, అందంగా వున్న ఆ అమ్మాయ్ ని చూడగానే తిలోత్తమ 70921 డాన్స్ షో జరిగే చోటుకి పక్కనే వున్న ఏదైనా ఆడిటోరియం లో వెంటనే ఈ అమ్మాయ్ తో డాన్స్ షో ఏర్పాటు చేస్తే బావుండు అనిపించింది. కానీ తను దేవుడు కాబట్టీ, అలా అలోచించకూడదు కాబట్టీ, తను వచ్చిన పని వేరు కాబట్టీ భక్తుడి కోరిక పని గురించి ఆలోచించడం మొదలు పెట్టాడు.

తొమ్మిది రోజులు కష్ట పడ్డది దేనికో ఆ విషయం కూడా పక్కన పెట్టి ఈ కోరిక కోరుకున్నాడు అంటే అందులో కాస్త ఇంటెన్సిటి కనిపించింది. అందునా ఇదే ఈ రోజు బొణీ కూడా. సరే, ఈ కోరికనే తీరుద్దాం అని సాఫ్ట్ వేర్ లో అందుకు తగ్గట్టుగా రిక్వెస్టు సబ్మిట్ చేసాడు. 'రిక్వెస్ట్ కెన్ నాట్ బీ ప్రొసేస్సెడ్ డ్యు టు ఎ డేడ్ లాక్ !!' అని ఎర్రర్ మెసెజ్ వచ్చింది. డీటైల్స్ చూస్తే ఆ అమ్మాయ్ కి అల్రేడీ పెళ్ళయ్యిందని, కట్నం వగైరా గొడవల వల్ల మొన్నీ మధ్యే డైవర్స్ కూడా తీసుకుందని, ఇప్పుడు తల్లిదంద్రుల తోనే ఉంటూ వారి భాద్యతని తనే తీసుకొని మరో 5 సంవత్సరాల వరకూ కెరిర్ తప్ప ఇంకే విషయం మీద మనసు మళ్ళించొద్దని నిర్ణయించుకుందని, చూడడానికి చిన్న పిల్లలా ఉన్నా ఆ యంగ్ భక్తుడికన్నా వయసులో 5 ఏళ్ళు పెద్దదని రాసి వుంది. దేవుడికే ఓరి దేవుడా అనిపించిన ఆ మొత్తం సంగతిని జీర్ణించుకోలేక పోయిన గణపతి వాతాపి జీర్ణం అంటూ ఇక లంచ్ బ్రేక్ కి చిత్తగించాడు.

.................................
.................................
.................................

ఒక బక్క చిక్కిన రైతు భక్తుడు... అలా దూరంగా తన వైపే వస్తూ కనిపించాడు. ఫ్రపంచంలో వున్న దుఃఖం మొత్తానికి బ్రాండ్ అంబాసిడర్ లా వున్నాడు. నేలే నా తల్లి, వ్యవసాయమే నాకు తెలిసిన విధ్య అనుకునే లక్షలాది అమాయక రైతులకి ప్రతిరూపం తను. వస్తుందో రాదో తెలియని రాబడి మీద అవసరంతో, పడతాయొ లేదో తెలియని వర్షాల మీద నమ్మకం తో దగా పడ్డ మరో రైతు ఆ భక్తుడు. "నాలుగేళ్ళ క్రితం కాలం బాగా ఐనప్పుదు క్వింటాల్ బియ్యం గుడి కి దానం చేసిన ఈ రైతుకి ఇప్పుడు వేసుకోవడానికి చక్కటి బట్ట కాదు కదా, తినడానికి తిండి కూడా లేదు. ఐతే అతివృష్ఠి, కాకుంటే అనావృష్ఠి అవడం వల్ల నాలుగేళ్ళలో నాలుగు లక్షలు అప్పు మిగిలింది ..." ఇంక చదవలేక అప్ప్లికేషన్ విండో క్లోజ్ చేసి ఎదురుగా నిల్చున్న రైతు భక్తున్ని చూడ సాగాడు గణపతి.

కోరిక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వానలు సమయానికి కురవాలనో, చేను కి పట్టిన తెగులు పోవాలనో తప్ప ఇంక వేరే కోరిక ఏం వుంటుంది ??

'పంపు సెట్టు కాలి పోయింది....
చేనుకు ఎర్ర తెగులు పట్టుకుంది.

మొత్తం 4 వేలు ఐతే ఈ సారికి పని జరుగుద్ది.
అప్పు పుట్టేలా చూడు సామీ...'

ఇదీ కోరిక.

బక్క రైతు కి అప్పు పుట్టించడం దేవుడి తరం కూడా కాదు. ఆ విషయం ఎంతో ప్రస్పుటంగా తెలిసిన గణపతి మరేదైనా మార్గం వుందా అని ఆలోచించసాగాడు. ఒక బంగారం లాంటి ఆలోచన తట్టింది. లాంటి కాదు, బంగారు ఆలోచనే. నా విగ్రహనికి వున్న ఏదో ఒక బంగారు అభరణాన్ని అతడికిచ్చేస్తే ? ఐడియా బాగానే వుంది. లెఫ్ట్ హ్యండు రింగు ఫింగురు కి ఇప్పటికే మూడు ఉంగరాలు ఉన్నాయ్. ఆది చాలదన్నట్టు ఊరి ప్రెసిడెంట్ అల్లుడు, లోకల్ అగ్రికల్చర్ ఆఫీసరూ ఐన రంజిత్ కుమార్ ఇందాకే మరో ఉంగరన్ని ఫొటో కి ఫోజ్ ఇస్తూ మరీ తొడిగాడు.

ఫైగా ఈ రంజిత్ కుమార్ సంపాదించే ఇల్లీగల్ ఆస్థుల్లో ఈ రైతులదే సింహ భాగం. ఈ ఉంగరన్నే రైతు భక్తుడికి ఇస్తే? ఆలోచన బాగానే అనిపించింది. ఇంకా ఆలస్యం చెయ్యకుండా ఆ పనిలో పడ్డాడు గణపతి.

తన జేబు లోకి బంగారు ఉంగరం వచ్చిన విషయం ఇంకా ఆ రైతుకి తెలిసినట్టు లేదు. కానీ ఇక్కడికి వచ్చి కోరిక చెప్పుకోవడం వల్ల ఎదో ఆశ మాత్రం కలిగినట్టు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది అతని కళ్ళలో. హుండీలో వేద్దాం అని రూపాయి కోసం జేబు లో చెయ్యి పెడితే ఉంగరం చేతికి తట్టింది. తీసి చూసి, అది జేబు లోకి ఎలా వచ్చిందో అర్థం అవక ఆలోచించసాగాడు బక్క రైతు.

'కొంప దీసి ఏ పూజారికి ఇవ్వడమో లేక హుండీ లో వెయ్యడమో చెయ్యకు, అది నీది, తీసుకొని వెళ్ళు.....' అని మనసు లో అనుకున్నాడు గణపతి. కానీ ఏం చెయ్యాలో పాలు పోని రైతు ఉంగరాన్ని అలాగే చేతిలో పట్టుకొని ఆలోచిస్తుంటే ఆ విషయం గమనించిన ఆలయ ఇంఛార్జ్ మల్లేష్ దగ్గరగా వచ్చి అది దేవుడికి సంభంధించిన ఉంగరమే అని నిర్ధారణకి వచ్చాక, ఇద్దరు ముగ్గురు పని వాళ్ళని కూడగట్టుకొని వచ్చి ఉంగరాన్ని లాక్కొని రైతు చెప్పేది ఎమీ పట్టించుకోకుండానే థర్ద్ క్లాసు మాటలతో రక్తం వచ్చేలా కొట్టడం ప్రారంభించారు.

పాపం, గణపతి కి ఏం చెయ్యాలో పాలు పోలేదు. పరిస్థితి ఇలా మారుతుందని తాను అస్సలు ఊహించలేదు. ఒక రకంగా దెబ్బలకి తానే కారణం కాబట్టి సినిమాల్లో చూపించినట్టు భక్తుల దెబ్బలు తాను తినే సెట్టింగ్ చెయ్యాలన్నా కొంత సమయం కావాలి మరి.

బండ రాళ్ళకి కూడా కన్నీరు తెప్పించే ఈ సంఘటన కి దేవుడైన తనకి కన్నీరు రావడం పెద్ద అశ్చర్యం ఎమీ అనిపించలేదు.

ఆంతలొ పూజారి కల్పించుకొని, 'ఇది గుడి. ఇక్కడ హింస ధర్మం కాదు. పోలీసులకి చెబితే వాల్లే చుసుకుంటారు' అని చెప్పడంతో శాంతించిన మల్లేషం పని వాల్లను ఆపమని వారించి, అవకాశం మల్లీ రాదన్నట్టుగా మరో రెందు థిర్ద్ క్లాసు బూతులు తిట్టి పోలీసులకి ఫొన్ చెయ్యడానికి వెళ్ళాడు. తను కేవలం ప్రెక్షకుడి లా చుస్తుండాల్సి రావడం గనపతి కి ఏ మాత్రం నచ్చలేదు. ఎంట్రెన్సు దగ్గర కన్స్త్ర్ర్క్షన్ జరుగుతున్న చోట పై నుండి రెండు ఇటుకలు కింద పడేలా చేసి మల్లేషం తల బద్దలు కొట్టాలి అని ఒక క్షణం అనుకున్నా తను దేవుడు అనే విషయం గుర్తుకి వచ్చి ఆగి పోయాడు.

ఓక్కొ సారి దేవుడిగా వుండడం కూడా భాధగానే వుంటుంది !!

ఈ రెండు విఫల యత్నాల తరువాత ఇంక లాభం లేదనుకొని తన లోకానికి ప్రయాణమవుదామని లాప్ టాప్ షట్ డౌన్ చెయ్య సాగాడు. కానీ ఒక్క భక్తుడి కోరిక కూడా పూర్తి చెయ్యకుండా వెనక్కి వెల్లడం సిగ్గు చేటు గా తోచింది. సాయంత్రం నాలుగు అవడం తో భక్తులు ఎవ్వరూ లేరు. గుడి మూసేసే పనిలో వున్నాడు పూజారి. దాదాపు 20 సంవత్సరాలుగా తన సేవ చేస్తున్నాడు. మాటికి మాటికీ కుంకుమ, అక్షింతలు జల్లి ఇరిటేట్ చెస్తున్నా రిథమిక్ గా మంత్రాలు చదివి రంజింప చేస్తున్నాడు. ఇంక ఆ రైతు విషయం లో కూడా తన మనసుని చదివినట్టుగా ప్రవర్తించాడు. భక్తే తప్ప కోరికలు లేని మనిషి. ఈ పూజారికే ఎందుకు సహాయం చెయ్యకూడదు ? అలా ఆలోచించిన గణపతి పూజారిని ఇంటి వరకూ ఫాలో అవ్వసాగాడు.

వెతకాల్సిన అవసరమే లేకుండా కుప్పలు తెప్పలు గా తీరని కొరికలు పడి వున్నాయ్ పూజారి ఇంట్లో. పిల్లవాడికి లేటెస్ట్ మోడల్ గేర్ల సైకిలు కావాలని కోరిక. కూతురుకి డొనేషన్ పెట్టి మెడిసిన్ చదవాలని కొరిక. భార్యకి పట్టు చీర నుంది కొత్త బంగ్లా వరకు రక రకాల కోరికలు!!

కుదిరినన్ని కోరికెల్ని తీర్చి తన ఆకలి తీర్చుకుందాం అనుకున్నాడు వినాయకుడు. మల్లీ లాప్ టాప్ బూట్ చేసి అప్ప్లికేషన్ని ఓపెన్ చేస్తుండగా పూజారికి, పూజరి భార్యకి మధ్య సంభాషణ ఇలా వినిపించింది.

"ఈ రోజు కలెక్షన్ ఎంత ?"

"పండగ కదా... బాగానే ముట్టింది. ఒక వెయ్యి దాకా వుండొచ్చు,
నేను హుండీ తెరవడం కొద్దిగా అలస్యం అయ్యి వుంటే మల్లెషం చూసి వుండెవాడు!!"

"వాడేదో సంసారి ఐనట్టు... గుడి భూముల కబ్జాలో వాడికి కూడా వాటా వుందిగా... వాటితొ పొలిస్తే ఇదేం పెద్ద విషయమే కాదు.
ఐనా మీరు కాస్త జాగ్రత్తగా వుంటే మంచిది"

అలా సాగిన ఆ సంభాషణకి బాధపడాలో, కోపపడాలో, నవ్వాలో ఎమీ అర్థం అవలేదు గణపతికి. వెంటనే పూజారికి సంభందించిన రికార్డు ఓపెన్ చేసి ఫ్లాష్ బ్యాక్ బటన్ నొక్కి చూస్తే తన వంశమె గత మూడు తరాలుగా గుడికి పూజారులుగా వున్నట్టు, తను పూజారి గా అపాయింట్ అయ్యే సమయానికి తమ కుటుంబం కటిక పేదరికంలో వున్నట్టు, మొదట్లొ సిన్సియర్ గానే వున్నట్టు, కమిటీ వాల్ల అక్రమాలని ఒకటి రెండు సార్లు ఎదురించినట్టు, కానీ పోను పోనూ ఇలా మారినట్టూ రాసి వుంది.

ఆటో రిక్షా నడిపే వాడి కన్నా తక్కువ రాబడి వుంటే తను మాత్రం ఏం చెస్తాడు !!

తన ఆవేశాన్ని మూడోసారి అనిచి వేసుకున్న గణపతి ఈ భజాయింపు తట్టుకోలేక వెంటనే తిరుగు ప్రయాణం అయ్యాడు.



English version :

Lord Ganesha's 12978189 th birthday it is. Thats the largest known prime number of that time. As someone who is good at studies, Ganesha wants to celebrate this 'special' birthday a special way and invites all of his friends. But Thilothama-2312's debut dance show looks more special to them and they bunk Ganesha's party by wishing him through SMSs and emails.

If second generation King George has to be called King George - II, 2312 is this Thilottama's number.

Angry and bored Ganesha thinks of traveling to earth, where he is given more respect and value. He also had a desire to visit a temple on the earth and to hear and fulfill the wishes of devotees. So as it looks like a better idea for both the reasons, makes no delay and starts to a temple in Vishakapatnam without even informing his vehicle, the rat. If he tells about it to the rat, it offers a ride and that will be his next birthday by the time he reaches earth !!

Its around 8 in the morning. The vitamin D sunlight isn't yet gone outside. There is a very pleasant cold breeze outside but by the time its reaching his room in the temple, its getting a lot hotter. They spend a lot of money in building and maintaining the temple but why don't they buy and fix at least a fan inside my room ? Birds sound outside mixed with the screaming of children inside seems very pleasant. From far behind, there he can also listen to a mass masala Telugu song which was a copy of some English album. Among all this noise, the rhythm in poojari's chantings appears very pleasant. As half of the words are more than a kilo meter far away from original Sanskrit words he couldn't figure out the meaning but enjoys the sound.

Disturbing him with a huge bell sound, one young devotee expresses his wish and asks him to pass him in his Chemistry exam that he wrote recently. He claims he has been regular to the temple for last 9 days and that that's the only wish that he had for life. Ganesha cross checks the data base to make sure what he is saying is right and while he is just about to approve the request using the software he has for that, the devotee asks for a change request saying he fell in love with a gal who just arrived to the temple and again promises that that's the only wish that he had for life. Confused Ganesha looks at the girl and seeing her beauty feels as if its justified for this guy to put that change request. Ganesha also thinks that if this gal is brought to Devaloka, she will rule Thilottama-2312 out :) When he tries to submit that change request, the software shouts 'Request can not be processed further due to a deadlock !!'. Looking into the details Ganesha finds out that the girl was already married an yr back, got divorced due to dowry issues, taking care of her parents now and that career is the only interest for her for next 5 yrs. He also finds out that though she looks young, she is 5 yrs elder to the young devotee. True deadlock !!

A poor and thin farmer arrives into the temple. He appears to Ganesha as if he is the brand ambassador for the whole misery in the world. He needs Rs. 4k as loan to fix his broken pump set and to buy fertilizers and that's his wish. As a wise man (sorry god), Ganesha very well knows that its impossible even to a God to convince anyone to give loan to a poor farmer of Andhra Pradesh. So he thinks of an alternative and comes across a gold like an Idea. Not gold like, but a 'gold' idea. He has lot of gold ornaments. Few hours ago Ranjith Kumar, son-in-law of the president of the town who is also the local Agricultural officer presented Ganesha with a ring along with a pose to a photograph. The ring is too tight to wear. Good.. let me displace this to the pocket of the farmer and the job is done !! He makes no delay in doing that. While attempting to grab an one rupee coin, the farmer finds out that there is a golden ring in his pocket. Being confused, he holds the ring in his hand and thinks about what to do. Ganesha is afraid that this guy will return it back to the Poojari or put that back in the hundi. Temple in-charge Mallesham observes the ring in his hand and starts beating farmer along with four workers there without even making an attempt to listen to what he is saying. Ganesha is sad. As in a way he the reason for the farmer getting beaten, wants to save him. But even if he could and play trick of transferring the pain to his body from farmer's as shown in our movies, it takes some time. Bringing tears to Ganesha wasn't that tough to this incident that can even make stones cry. Poojari warns Mallesham saying its temple and violence isn't good in these premises and advices to leave the farmer and inform police. Mallesham scolds the farmer using some third class vocabulary as if he wouldn't get such chance again and goes to call police. Ganesha wishes to make 2 bricks in the construction area at the entrance fall on Mallesham's head. But as he is a god and as gods are not supposed to wish such things, he stops there. Its tough to be a God too some times !!

Worried and sad, Ganesha plans to go back to his place. Temple is about to be closed and no more devotees. Ganesha is sad for the reason that he couldn't make even one devotee's wish true but he had no option. The Poojari is doing the work of closing the temple. This person has been in the service of Ganesha for more than 20 yrs. Also, as if he read Ganesha's mind he did exactly what was needed at the need of the hour in case of the farmer. Why not help him ? Yeah, the idea is good and Ganesha follows the Poojari tilll his home to find out if there is any help that he can do to him or his family. Leaving no need to search for wishes, there are umpteen number of em awaiting. Poojari's young son wants a latest model Gear cycle. His daughter wants to do Medicine paying donation. His wife's desires range from a costly saree to a new Banglaw. While Ganesha is about to boo this laptop launch the required s/w application, he hears the conversation between the Poojari and his wife.

"How much is the collection today ?"
"It should be around 1000 as its festival day. Mallesham just missed seeing me taking money from Hundi"
"Ah, that Mallesham also involved in temple land kabja etc., what you are doing is nothing in front of that !!, anyway you gotta be careful"
"Yeah..."

Ganesha is speechless. He pulls the flashback record of the Poojari. His family was serving as Poojari for the temple for last 3 generations. He was damn poor when he was appointed as temple Poojari. He was sincere in the initial days and also fought a couple of time with the committee against their corruption. But yrs down the line, he is changed to what he is now.

What else can he do if his monthly earnings are lesser than that of an Auto Rickshaw driver ??

Ganesha goes back to his place thinking that though thats boring, thats better there...........